
సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే వారానికి ఒకట్రెండుసార్లు సైక్లింగ్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చని చెబుతున్నాయి తాజా రీసెర్చ్‌లు. నిజానికి ప్రతిరోజూ వర్కవుట్స్ చేయడం వల్ల ఎన్నో రోగాలు దూరమవుతాయి. అయితే ఒక్కో వర్కవుట్‌తో ఒక్కో ప్రయోజనం ఉంటుంది.
సైక్లింగ్‌తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు వారానికి కొంతసేపు సైక్లింగ్ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నాయి తాజా పరిశోధనలు.
అమెరికాలో ఆరువేల మంది బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులపై పరిశోధన చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. వారానికి 150 నిమిషాలు సైక్లింగ్ చేసినవారిలో 30 శాతం మందికి బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయినట్లు గుర్తించారు. అంతేకాదు బ్రెస్ట్ క్యాన్సర్ లేనివారు సైక్లింగ్ చేయడం వల్ల దాని బారిన పడకుండా ఉంటారని జర్మనీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు, వ్యాయామానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశంపై తొలిసారిగా స్టడీ చేసిన సైంటిస్టులు ఈ విషయాలను వెల్లడించారు.