అంఫాన్ బీభ‌త్సం.. బెంగాల్‌లో 72 మంది మృతి

అంఫాన్ బీభ‌త్సం.. బెంగాల్‌లో 72 మంది మృతి

అంఫాన్‌ తుఫాన్ ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాన్‌ వల్ల ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 72 మంది చనిపోయారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఆమె ప్రకటించారు. తన జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని చూడలేదని మ‌మ‌తా అన్నారు. కరోనా కన్నా తుఫాన్‌ ఎక్కువ నష్టాన్ని కల్గించిందన్న ఆమె.. బెంగాల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించాలని కోరారు.

బలమైన ఈదురు గాలులు, వర్షాలకు.. రాష్ట్రంలో వేలాది ఇండ్లు ధ్వంసం అయ్యాయి. కరోనా వైరస్‌ ఆంక్షల నేపథ్యంలో.. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. బెంగాల్‌ తీరం వద్ద గంటకు 185 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అంఫాన్‌ నష్టం సుమారు లక్ష కోట్ల వరకు ఉంటుందని మ‌మ‌తా తెలిపారు.

Cyclone Amphan killed 72 in West Bengal, says CM Mamata Banerjee