తెలంగాణలో జపాన్​ కంపెనీ450 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​

తెలంగాణలో జపాన్​ కంపెనీ450 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​

తెలంగాణలో జపాన్​ కంపెనీ450 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​
చందనవెల్లిలో కొత్త ప్లాంట్​
470 మందికి ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వంతో డైఫుకూ ఎంఓయూ

హైదరాబాద్ : ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ  సొల్యూషన్స్ అందించే డైఫుకూ తెలంగాణలో విస్తరణ కోసం రూ.450 కోట్లు ఇన్వెస్ట్​ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ హైదరాబాద్​ శివార్లలోని చందనవెల్లిలో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. పాశమైలారంలో ప్రస్తుత ఫ్యాక్టరీ 60వేల చదరపు అడుగుల్లో ఉంది. కొత్త ప్లాంటు వల్ల కంపెనీ సామర్థ్యం మరో  రెండు లక్షల చదరపు అడుగులు పెరుగుతుంది. చందనవెల్లి ఫెసిలిటీ కోసం మొదటి దశలో రూ.200 కోట్లు ఇన్వెస్ట్​ చేస్తారు. రాబోయే 18 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. దీంతో 470 మందికి ఉపాధి లభిస్తుంది. ఆటోమేటెడ్​ స్టోరేజ్​ సిస్టమ్స్​, కన్వేయర్స్​, ఆటోమేటెడ్​ స్టార్టర్లను డైఫుకూ తయారు చేస్తుంది. దీని భారతీయ అనుబంధ సంస్థ, వేగా కన్వేయర్స్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడుతూ కంపెనీని విస్తరణలో జపాన్ నుంచి సాంకేతికత బదిలీ (టెక్నాలజీ ట్రాన్స్​ఫర్​)  కూడా భాగమని, దీనివల్ల తమ ప్రొడక్ట్​ డెవెలప్​మెంట్ వేగంగా జరుగుతుందని అన్నారు. 

కొత్తగా ఆలోచించండి..

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ​ పారిశ్రామికవేత్తలు మరింత వినూత్నంగా ఆలోచించాలని, ఇన్నోవేషన్లపై దృష్టి పెట్టాలని కోరారు.  రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు భారీస్థాయిలో ఆలోచించి మనదేశానికేగాక ప్రపంచానికీ అవసరమైన ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు.  డిజైన్​, మాన్యుఫాక్చరింగ్​చాలా ముఖ్యమని, ఈ అంశాలను సిలబస్​లోనూ చేర్చాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఇది వరకు రాజధానిలో పరిశ్రమ పెట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడంతో ఇప్పుడు ఇది సమస్యే కాదు. భారతీయ పారిశ్రామికవేత్తలు మరింత ధైర్యంగా,  దూకుడుగా ఉండాలి. స్టూడెంట్లకు కూడా డిజైనింగ్​ మెళకువలు నేర్పించాలి. బాసర ఐఐటీతో ఒప్పందం చేసుకొని అక్కడి స్టూడెంట్లకు ఇంటర్న్​షిప్​ సదుపాయం కల్పించాలని నేను ఇటీవలే ప్రోక్టర్​ అండ్​ గ్యాంబుల్​ను కోరాను. దీనివల్ల ఇండస్ట్రీలతోపాటు విద్యాసంస్థలకూ లాభం” అని రామారావు అన్నారు. దండుమల్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ పార్కును ఉదహరిస్తూ, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలను పెంచుకోవడంలో పోటీ పడాలని, రాష్ట్రంలో మరిన్ని పెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. తయారీ రంగంపై మరింత దృష్టి సారించాలని, అమెరికా, చైనాకు ధీటుగా భారత్ 10 ఏళ్లలో ఎదగాలని అన్నారు. డిజైన్​, మానుఫ్యాక్చరింగ్​ విషయంలో జపాన్​ను చూసి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని కేటీఆర్​ అన్నారు. మన ఎంట్రప్రినూర్లు హైటెక్, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు బేసిక్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌పై కూడా దృష్టి పెట్టాలని కేటీఆర్​ సూచించారు.