
అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని దేశాలు మ్యాచ్ లతో బిజీగా మారనున్నాయి. ఈ వారంలో శ్రీలంక తప్పితే అన్ని దేశాలు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు మహిళల వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా మొదట న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనున్నాయి. శనివారం (అక్టోబర్ 18) ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. మొత్తం మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. సోమవార (అక్టోబర్ 20) రెండో టీ20.. గురువారం (అక్టోబర్ 23) వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి.
శనివారం (అక్టోబర్ 18) బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. మూడు వన్డే మ్యాచ్ ల కోసం వెస్టిండీస్ బంగ్లాదేశ్ లో పర్యటిస్తుంది. శనివారం తొలి వన్డే.. మంగళవారం (అక్టోబర్ 21), గురువారం (అక్టోబర్ 23) వరుసగా రెండు, మూడు వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 27, 29, 31 వరుసగా మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్ట్ సోమవారం (అక్టోబర్ 20) నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 28, 31 నవంబర్ 1 న వరుసగా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ అక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా, ఇండియా సిరీస్:
2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.