రాజస్థాన్ లో డైకిన్ ఆర్ &డీ సెంటర్

రాజస్థాన్ లో డైకిన్ ఆర్ &డీ సెంటర్

న్యూఢిల్లీ : ఏసీలు తయారు చేసే డైకిన్ ఇండియా రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. రీసెర్చ్ & డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ & డీ) సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి వచ్చే మూడేళ్లకు గాను ఈ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖర్చు చేయనుంది.  మొత్తం 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిపడే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డెవలప్ చేస్తామని, ఇందుకోసం 250 మంది ఇంజినీర్లు పని చేస్తారని డైకిన్ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

ఈ కొత్త సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 22 టెస్టింగ్, ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని వివరించింది. ‘ఈ ఆర్ & డీ సెంటర్ ఇండియాకు సరిపోయే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డెవలప్ చేయడంపైనే కాకుండా, గ్లోబల్ కన్జూమర్లకు కూడా సరిపోయే పర్యావరణానికి హానిచేయని టెక్నాలజీలను డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంపై కూడా ఫోకస్ పెడుతుంది’ అని  డైకిన్ ఇండియా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేజే జావా అన్నారు. ఈ సెంటర్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.