డైరీ మిల్క్​ చాక్లెట్లో పురుగులు వస్తున్నాయి.. తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ

డైరీ మిల్క్​ చాక్లెట్లో పురుగులు వస్తున్నాయి.. తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ

డైరీమిల్క్ చాక్లెట్లు సురక్షితం కాదని..వీటిని తినొద్దని తెలంగాణ ఫుడ్ సేప్టీ అధికారులు హెచ్చరించారు. చాక్లెట్ల లోపల పురుగులు ఉంటున్నాయని తెలిపారు.మంచిని ఆశిద్దాం.. తియ్యని వేడుక చేసుకుందాం ఇదీ క్యాడ్ బరీ(Cadbury) డైరీమిల్క్(Dairy Milk) చాక్లెట్ స్లోగన్. పిల్లల నుంచి పెద్దల వరకు దీని రుచికి దాసోహం అవ్వని వారు ఉండరు. నోట్లోవేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ చాక్లెట్ చుట్టూ  తీవ్ర వివాదం నడుస్తోంది. తెలంగాణ(Telangana) స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ ఏకంగా ఈ చాక్లెట్ సురక్షితం కాదు..తినొద్దంటూ హెచ్చరించడం సంచలనం రేకెత్తిస్తోంది.

ఆకర్షణీయమైన కవర్ తో చూడగానే ఆకట్టుకునేలా మిళమిళ మెరిసిపోతూ కనిపించే డైరీమిల్క్(Dairy Milk) చాక్లెట్లు తినడం అంత సురక్షితం కాదని తెలంగాణ ఫుడ్ సేప్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ తళుకుబెళుకు కవర్ల వెనక కంటికి కనిపించని పురుగులే కాదు... కనిపించే పురుగులు సైతం ఉన్నాయని తెలిపింది . చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్స్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో చాక్లెట్స్ తినాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన చాక్లెట్స్ లభిస్తాయి.  వాటిల్లో క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి క్యాడ్‌బరీ చాక్లెట్‌ కొన్నాడు. కవర్ ఓపెన్ చేసి తీరా తిందామనుకునే సరికి సజీవంగా ఉన్న పురుగు కనిపించింది.ఆ తళుకుబెళుకు కవర్ల వెనక కంటికి కనిపించని పురుగులే కాదు... కనిపించే పురుగులు సైతం ఉన్నాయని తెలిపింది. 

దీంతో ఆ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడంపై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ ఘటనపై స్పందించిన జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన షాపుపై దాడి చేశారు. అతను కొన్న చాక్లెట్ల నమూనాలను ల్యాబ్‌ కు పంపించి పరీక్షలు నిర్వహించగా  షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కంపెనీకి చెందిన చాక్లెట్లు తినటం ఆరోగ్యానికి అంత సురక్షితం కాదని అభిప్రాయపడుతూ.. తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రిపోర్టు విడుదల చేశారు. ఈ చాక్లెట్లలో.. ఆరోగ్యానికి హాని చేసే కారకాలు చాలా ఉన్నాయని తెలిపారు.క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ నిర్దారించింది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ తినకూడదని వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్నప్తి చేసింది.