
నీళ్లలో స్నానం చేయడం కామనే. కానీ పాలలో స్నానం చేస్తే వెరైటీగా ఉంటుందని భావించాడో ప్రబుద్ధుడు. పాల టబ్బులో ఓ వ్యక్తి స్నానం చేసిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది. టర్కీలోని ఓ డెయిరీ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఉగుర్ టుట్గుట్ అనే వ్యక్తి పాల డెయిరీలో పని చేస్తున్నాడు. తను పని చేస్తున్న డెయిరీలోని పాల టబ్‌లో అతడు స్నానం చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఉగుర్‌తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు డెయిరీపై స్థానిక అధికారులు ఫైన్ వేయడంతోపాటు కంపెనీని తాత్కాలికంగా మూసేశారు. డెయిరీలోని ఎక్విప్‌మెంట్‌ను సీజ్ చేశారు.