మంత్రి వివేక్ కు శుభాకాంక్షలు తెలిపిన లీడర్లు

మంత్రి వివేక్ కు శుభాకాంక్షలు తెలిపిన లీడర్లు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : మంత్రి వివేక్ వెంకటస్వామిని బీఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, లింగాల రవికుమార్, మాల మహానాడు సీనియర్ నాయకుడు గుంతెటి వీరభద్రం ఆదివారం హైదరాబాద్​లో కలిసి శుభకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం దళితులు చైతన్యం, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపాడే నాయకులకు ఉన్నత పదవులు రావడం అభినందనీయమన్నారు. మంత్రిని కలిసినవారిలో మాల మహానాడు జిల్లా నేతలు కొరివి దయానంద్, మెట్టు వెంకటేశ్వర్లు, కొరివి భాస్కర్, గుంతెటి వసంతరావు, అంబడపూడి పేతురు, ఎర్ర గంగాధర్,  సాలే నితీశ్​ ఉన్నారు.