ఢీ షో డ్యాన్స్ కొరియాగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. అసలేం జరిగింది..? 

ఢీ షో డ్యాన్స్ కొరియాగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. అసలేం జరిగింది..? 

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నెలకుంది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో చైతన్య సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. తాను సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చినవాళ్ల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, చాలా ట్రై చేసినా తన వల్ల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఒక అప్పును పూడ్చుకునేందుకు.. మరో తప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని చైతన్య వెల్లడించాడు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యలకు సమాచారం ఇచ్చి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.