బైక్ పై అమ్మాయిలతో యువకుడి వికృత స్టంట్స్

బైక్ పై అమ్మాయిలతో యువకుడి వికృత స్టంట్స్

రోడ్లపై ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ మితి మీరిపోతున్నాయి. ఇష్టానుసారంగా బైకులు నడుపుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నారు.  దీని కారణంగా అమాయకులైన ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.  తాజాగా ముంబైలో యువత బైక్ స్టంట్లు చేస్తూ కెమెరాకు చిక్కింది. 

ముంబై రోడ్లపై  ఓ యువకుడు బైక్ను  విచ్చలవిడిగా నడిపాడు.  ఓ యువతిని ముందుభాగంలో..మరో యువతిని వెనుకభాగంలో కూర్చోబెట్టుకొని ప్రమాదకరంగా డ్రైవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

https://twitter.com/PotholeWarriors/status/1641368172619268096

అసలే త్రిబుల్ రైడింగ్. పైగా హెల్మెట్లు ధరించలేదు. దీనికి తోడు వన్ వీల్ తో విన్యాసాలు చేయడం స్థానికంగా ఇతర ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. అయితే ఈ వీడియోపై ముంబై బీకేసీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  యువకుడితో పాటు..ఇద్దరు యువతులపై కేసు నమోదు చేశారు. నిందితులకు జరిమానాతో పాటు..వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తించడానికి విచారణ చేపట్టామని.. వారి గురించి సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.