సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా వెటోరీ

సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా వెటోరీ

హైదరాబాద్‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌ ఫ్రాంచైజీ సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ తమ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా న్యూజిలాండ్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ డానియెల్‌‌‌‌ వెటోరీని తీసుకుంది. ప్రస్తుత కోచ్‌‌‌‌ బ్రియాన్‌‌‌‌ లారా ప్లేస్‌‌‌‌లో వెటోరీకి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సోమవారం తెలిపింది. 

ఐపీఎల్‌‌‌‌లో కోచింగ్‌‌‌‌ బాధ్యతలు చేపట్టడం న్యూజిలాండ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌కు ఇది రెండోసారి. 2014–18 మధ్య కాలంలో రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు కోచ్‌‌‌‌గా పని చేసిన వెటోరీ.. ఆస్ట్రేలియా మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు అసిస్టెంట్‌‌‌‌ కోచ్‌‌‌‌గా, బంగ్లాదేశ్‌‌‌‌ జట్టుకు స్పిన్‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌గానూ వ్యవహరించాడు. 

ఇక 2022లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు బ్యాటింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా పని చేసిన లారా.. 2023 సీజన్‌‌‌‌కు ముందు టామ్‌‌‌‌ మూడీ నుంచి హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ బాధ్యతలు స్వీకరించాడు. కానీ అతని ఆధ్వర్యంలో ఆడిన 14 మ్యాచ్‌‌‌‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలవడంతో వేటు తప్పలేదు.