అర్జున్ రెడ్డి డైరెక్టర్‎తో డార్లింగ్ ప్రభాస్ సినిమా

అర్జున్ రెడ్డి డైరెక్టర్‎తో డార్లింగ్ ప్రభాస్ సినిమా

సినిమా: గత కొన్ని రోజులుగా రెబల్‎స్టార్ ప్రభాస్ 25వ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రెబల్‎స్టార్ ప్రభాస్ తన 25వ సినిమాను పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నారు. దీనికి ‘స్పిరిట్’ అనే ఆసక్తికరమైన టైటిల్‎ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన దర్శక నిర్మాతల నుంచి విడుదలైంది. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి.. అక్కడ కూడా సంచలన విజయం అందుకున్నారు. రెబల్‎స్టార్ ప్రభాస్‌ను ఇప్పటి వరకు అభిమానులు ఊహించనటువంటి కొత్త పాత్రలో సందీప్ రెడ్డి చూపించబోతున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుకోబోతోంది. టీ సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.  ప్రస్తుతం ప్రభాస్.. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

For More News..

చరిత్ర లిఖించే విధంగా హుజురాబాద్ ఫలితాలుంటాయి

ప్రతి కులానికి కేసీఆర్ నిధులిస్తున్నారు