ODI World Cup 2023: 48 ఏళ్ల రికార్డ్ బ్రేక్: సెంచరీతో డారెల్ మిచెల్ సరికొత్త చరిత్ర

ODI World Cup 2023: 48 ఏళ్ల రికార్డ్ బ్రేక్: సెంచరీతో డారెల్ మిచెల్ సరికొత్త చరిత్ర

వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ చెలరేగి ఆడుతున్నాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదర్కొని సెంచరీ చేసాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్ లోకి వచ్చిన మిచెల్ తన వీరోచిత సెంచరీతో కివీస్ కు భారీ స్కోర్ అందించాడు. ఈ క్రమంలో ఈ స్టార్ బ్యాటర్ వరల్డ్ కప్ లో ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

1975 తర్వాత వన్డే వరల్డ్ చరిత్రలో భారత్ పై సెంచరీ చేసిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. 1975 ఇంగ్లాండ్ లో జరిగిన తొలి వరల్డ్ కప్ లో లో గ్లెన్ టర్నర్ భారత్ పై సెంచరీ బాదేశాడు. ఇక ఆ తర్వాత ఇరు జట్లు చాలా సార్లు తలపడిన సెంచరీ మాత్రం నమోదు కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులో మిచెల్ సెంచరీ చేయడం ద్వారా ఈ రికార్డ్ కు బ్రేక్ పడింది. 100 బంతుల్లో 100 పరుగుల మార్కును మిచెల్ అందుకున్నాడు. 

మిచెల్ సెంచరీకి తోడు రాచీన్ రవీంద్ర 75 పరుగులతో రాణించడంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ 9 ఫోర్లు 5 సిక్సులతో 127 బంతుల్లో 130 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీకి ఐదు వికెట్లతో రాణించాడు. కుల్దీప్ రెండు వికెట్లు, బుమ్రా, సిరాజ్ కి చెరో వికెట్ లభించింది.