ముగిసిన శ్రీమద్రామాయణ పారాయణం

ముగిసిన శ్రీమద్రామాయణ పారాయణం

భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య దసరా మండపంలో రావణదహనం జరిగింది. ఉదయం చిత్రకూట మండపంలో శ్రీమద్రామాయణ పారాయణం సందర్భంగా వేదపండితులు పూర్ణాహుతిని నిర్వహించారు. శ్రీసీతారామచంద్రస్వామికి విశేష అభిషేకాలు,  నిత్య కల్యాణం తర్వాత పట్టాభిషేకం చేశారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించి రామయ్యకు విజయోత్సవ ర్యాలీ చేశారు. రామయ్య తన ఆయుధాలతో ఆలయం నుంచి దసరా మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు జమ్మి చెట్టు వద్ద స్వామి ఆయుధాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకను చూసేందుకు భక్తులు తరలివచ్చారు. రావణదహనం కార్యక్రమాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య నిర్వహించారు. అనంతరం స్వామి తిరిగి ఆలయానికి వెళ్లిపోయారు. 

సింగరేణిలో దసరా వేడుకలు
మణుగూరు, వెలుగు:
మణుగూరులోని భద్రాద్రి స్టేడియంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి మణుగూరు జీఎం వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కల్చరల్​ప్రోగ్రామ్స్​ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీబీజీకేఎస్ లీడర్ వి.ప్రభాకర్, ఎస్వోటు జీఎం లలిత్ కుమార్, డీఎస్పీ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.