అమరుల కుటుంబాలను సర్కార్ భిక్షగాళ్లను చేసింది

అమరుల కుటుంబాలను సర్కార్ భిక్షగాళ్లను చేసింది

ఫామ్ హౌజ్ లు, భవనాలు కట్టుకోడానికి డబ్బులున్నాయి… కానీ అమరవీరుల స్తూపానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు ఏఐసీసీ కార్యదర్శి దాసోజు శ్రవణ్. అసలు చనిపోయిన వాళ్లు ఎంత మందో లెక్క చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో 1200 మంది చనిపోతే.. సర్కార్ మాత్రం 500 మందే అంటోందన్నారు. అమరుల కుటుంబాలకు... ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేవు, ఆర్ధిక సాయం ఇవ్వలేదని చెప్పారు. అమరుల కుటుంబాలను సర్కార్ భిక్షగాళ్లను చేసిందన్నారు. కేసీఆర్ క్షుద్ర రాజకీయంలో.. ఉద్యమకారులు బలి పశువులయ్యారన్నారు శ్రవణ్.