
జూబ్లీహిల్స్, వెలుగు: వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కన్న కూతురే హత్య చేసింది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లీలా నగర్లో లక్ష్మి(82) అనే వృద్ధురాలు నివాసముంటోంది. ఆమెకు మాధవి అనే కుమార్తె ఉండగా, పెండ్లి చేసినప్పటికీ భర్తతో దూరమై తల్లితోనే ఉంటోంది.
గత కొంతకాలంగా తల్లీకూతుళ్లు చీటికిమాటికి గొడవ పడుతున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య ఎప్పటిలాగే గొడవ జరగడంతో మాధవి ఓ ఇనుప రాడ్డుతో తల్లి తలపై బలంగా కొట్టింది. లక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కూతురు 108 కు కాల్ చేసింది.
అంబులెన్స్ సిబ్బంది ఇంటికి వచ్చి అప్పటికే లక్ష్మి మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితురాలు నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.