Cricket World Cup 2023: సచిన్ రికార్డ్ సమం చేసిన వార్నర్.. నెక్స్ట్ టార్గెట్ రోహిత్

Cricket World Cup 2023: సచిన్ రికార్డ్ సమం చేసిన వార్నర్.. నెక్స్ట్ టార్గెట్ రోహిత్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ వరల్డ్ కప్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. భారత్ పై 41 పరుగులు చేసి పర్వాలేదనిపించిన వార్నర్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ ల్లో తక్కువ స్కోర్ చేసి అంపైర్ తప్పిదాలకు బలయ్యాడు. అయితే పాక్ మ్యాచ్ లో తనలోని విశ్వరూపాన్ని ప్రదర్శించి భారీ సెంచరీ వార్నర్.. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ ఫామ్ ను కొసాగిస్తూ మరో సెంచరీ చేసాడు. ఈ మ్యాచ్ లో 93 బంతుల్లో 104 పరుగులు చేసిన వార్నర్.. ఈ వరల్డ్ కప్ లో వరుసగా రెండు సెంచరీ నమోదు చేసాడు. దీంతో  ఈ స్టార్ ఓపెనర్ వరల్డ్ కప్ లో సచిన్ రికార్డ్ సమం చేసాడు. 

సచిన్ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 6 సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. నెదర్లాండ్స్ మ్యాచ్ లో శతకం బాదడం ద్వారా వార్నర్ 6 సెంచరీలతో సచిన్ రికార్డ్ సమం చేసాడు. వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 7 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. 2015 లో బంగ్లాదేశ్ పై సెంచరీ చేసిన రోహిత్.. 2019 లో ఏకంగా 5 సెంచరీలు చేసాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సెంచరీ చేసాడు.

 
ఇక వార్నర్ విషయానికి వస్తే 2015 లో నెదర్లాండ్స్ పై తొలి సెంచరీ చేసిన డేవిడ్ భాయ్.. 2019 లో మూడు సెంచరీలు, ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు చేసాడు. ఈ వరల్డ్ కప్ లో వార్నర్ 332 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాల్లో మూడో స్థానంలో నిలిచాడు. డికాక్ 407 పరుగులుతో అగ్ర స్థానంలో ఉండగా.. కోహ్లీ 354 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.