David Warner: రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన వార్నర్

David Warner: రిటైర్మెంట్ పై  హింట్ ఇచ్చిన వార్నర్

ఆస్ట్రేలియా క్రికెట్ లో మరొక శకం త్వరలో ముగియనుంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో జరగబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు హింట్ ఇచ్చాడు. తాజాగా స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ తన రిటైర్మెంట్ సంబంధించిన విషయాలు పంచుకున్నాడు. 

‘అమెరికా, వెస్టిండీస్ లో జరిగే టీ20 ప్రపంచకప్ గెలవడమే నా లక్ష్యం. నా దేశానికి వరల్డ్ కప్ అందించి, గర్వంగా క్రికెట్ నుంచి తప్పుకుంటా. ఆస్ట్రేలియా జట్టుకు ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ తప్ప పెద్దగా టీ20 మ్యాచ్ లు లేవు. కాబట్టి టెస్టులు, వన్డేలపై దృష్టి పెట్టాం. ఈ ఏడాది ఆడబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ల్లో తప్పక రాణిస్తాన’ చెప్పాడు. 

మరిన్ని వార్తలు