
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌తో డేవిస్ కప్ కప్ మ్యాచ్‌లో పోటీ పడే ఇండియా టెన్నిస్ టీమ్‌కు కోచ్ జీషన్ అలీ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ టీమ్‌తో పాటు పాకిస్తాన్ వెళ్లకపోవడంతో జీషన్‌కు ఆలిండియా టెన్నిస్ షెడరేషన్ బాధ్యతలు అప్పగించింది. 60 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ టూర్‌కు వెళ్తున్న ఇండియా టీమ్ ఫిబ్రవరి 2,3వ తేదీల్లో ఇస్లామాబాద్‌లో హోమ్ టీమ్‌తో పోటీ పడనుంది. చివరగా 1964లో పాక్‌లో ఆడిన ఇండియా టెన్నిస్ టీమ్‌కు జీషన్ తండ్రి అక్తర్ అలీ కెప్టెన్‌గా వ్యవహరించడం గమనార్హం.