
- ప్రజల నుంచీ అభిప్రాయాలు స్వీకరిస్తాం
ఆసిఫాబాద్ వెలుగు: పార్టీ కోసం కస్టపడి పని చేస్తున్న సమర్థవంతమైన వ్యక్తులకు డీసీసీలుగా అవకాశం ఇస్తామని ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేశ్ కుమార్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ ఆఫీస్లో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో అబ్జర్వర్స్ శ్రీని వాస్, అనిల్ కుమార్, జ్యోతి, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రంతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఎన్నుకునేందుకు అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్ష ఎన్నిక కోసం అందరి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గాలు, బ్లాక్ ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ గెస్ట్ హౌస్లో ఉదయం డీసీసీ స్థాయి సమావేశం, మధ్యాహ్నం 12 గంటలకు సిర్పూర్ నియోజకవర్గ సమావేశం,13న ఆసిఫాబాద్ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించి, 14న ప్రజలు, మేధావుల అభిప్రాయాన్ని సేకరిస్తామని తెలిపారు.
పోటీలో ఉన్న అభ్యర్థులతో 19న ముఖాముఖి నిర్వహించి పారదర్శకంగా అధ్యక్షుల ఎంపిక చేపడతామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసేలా పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు మసాదే చరణ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మునీర్ అహ్మద్, మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.