సమన్యాయం కోసమే సమగ్ర కుటుంబ సర్వే : డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 

సమన్యాయం కోసమే సమగ్ర కుటుంబ  సర్వే : డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 

జనాభా ప్రతిపదికన అందరికీ సమన్యాయం చేసేందుకే రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతుందని డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. సమగ్ర సర్వేతో అన్ని వర్గాల జీవన స్థితిగతులు, జనాభా సంఖ్య తెలుస్తాయని తద్వారా మేలు చేసే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు పార్టీ శ్రేణులు సహకరించాలని, ఎటువంటి అనుమానాలున్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు.

సమావేశంలో స్టేషన్ ఘన్​పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి, జనగామ, స్టేషన్​ఘన్​పూర్, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్లు బనుక శివరాజ్ యాదవ్, జూలకంటి లావణ్యా శిరీషారెడ్డి, నల్లనాగుల శ్వేత వెంకటాచారి, పీసీసీ సభ్యులు చెంచారపు శ్రీనివాస్​ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, సీహెచ్ రాజమౌళి, వేమల్ల సత్యానారాయణ రెడ్డి, కంచె రాములు, జక్కుల అనిత, మారుజోడు రాంబాబు, బడికె ఇందిర, వంగాల కల్యాణీ మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్​, చెంచారపు బుచ్చిరెడ్డి, గుడి వంశీధర్​ రెడ్డి, నల్ల శ్రీరాములు, బొట్ల శ్రీనివాస్​, నూకల బాల్​ రెడ్డి, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.