అభ్యంతరాలు వచ్చినా..మాస్టర్​ ప్లాన్​ను రద్దు చేయరా? : శ్రీహరి రావు

అభ్యంతరాలు వచ్చినా..మాస్టర్​ ప్లాన్​ను రద్దు చేయరా? : శ్రీహరి రావు

నిర్మల్, వెలుగు : నిర్మల్ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్​పై అభ్యంతరాలు  వచ్చినా దాన్ని నిలిపివేయకుండా అమలు కోసం జీవో జారీ చేశారని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీల పరిధిలో సైతం మాస్టర్ ప్లాన్​పై అభ్యంతరాలు వస్తే అక్కడ పూర్తిగా నిలిపివేశారని, నిర్మల్​లో మాత్రం అలా ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ధర్మసాగర్ చెరువుకు కట్ట ఉండగా మళ్లీ చెరువు మధ్యలో మరో కట్ట వేసి స్థలాన్ని కబ్జా చేశారని.

ఈ కబ్జాను చూసి కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీని దూషించడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్​ను ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మర్చిపోయారా అని ప్రశ్నిస్తూ ఆ కుటుంబాన్ని విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాజీద్ అహ్మద్, మామడ జడ్పీటీసీ సోనియా,ఓడ్నాల రాజేశ్వర్, నందేడపు చిన్ను తదితరులు ఉన్నారు.