ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు:రాజకీయ మనుగడ కోసం ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్నారు. యాదాద్రి జిల్లా రాజాపేట, పాముకుంట (కాశగూడెం) గ్రామాలకు చెందిన పలువురు బుధవారం టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరగా, వారికి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఖాళీ అయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డమీది రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజాపేట ఎంపీపీ బాలమణి, మండల అధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, జడ్పీటీసీ గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాల సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పాముకుంట సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిందం కనకయ్య పాల్గొన్నారు.

పల్లె ప్రగతి  పనుల పరిశీలన

సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నారాయణపురం, వెలుగు : యాదాద్రి జిల్లా సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నారాయణపురం మండలం మహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను బుధవారం డిప్యూటీ సీఈవో డి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వైకుంఠధామం, డంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యార్డును పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పంచాయతీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రాములు, ఎంపీవో నరసింహారావు, సర్పంచ్ మల్లేపల్లి సునీత, విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ అమరేందర్ ఉన్నారు.

ఆర్థికాభివృద్ధిలో మహిళలు ముందుండాలి

యాదాద్రి, వెలుగు : ఆర్థికాభివృద్ధిలో మహిళలు ముందుండాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. బుధవారం బీబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె మాట్లాడారు. మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమాఖ్యగా ఎంపికైన బీబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహిళలను అభినందించారు. ప్రతి మహిళా ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకులు ద్వారా లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొని ఆర్థికాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. డీఆర్డీవో ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ సుధాకర్, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో స్వాతి, ఏపీఎం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ప్రతి ఫ్యామిలీకి దళితబంధు ఇవ్వాలి

గరిడేపల్లి, వెలుగు : ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వర్తింపజేయాలంటూ సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మహిళలు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – మిర్యాలగూడ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒకరిద్దరికీ అమలు చేస్తూ మిగిలిన వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి దళిత ఫ్యామిలీకి పథకం అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై కొండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఘటనాస్థలానికి వచ్చి మహిళలకు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు.

వడ్ల కొనుగోళ్లను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి

తుంగతుర్తి, వెలుగు : వడ్ల కొనుగోళ్లను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సూర్యాపేట అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆదేశించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వడ్లను కల్లాల్లోనే ఆరబెట్టుకొని కోనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. క్వాలిటీ ఉన్న వడ్లను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. సెంటర్ల నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనాలని, లారీలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాంపతి, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాంప్రసాద్, యాదగిరి ఉన్నారు. 

వడ్ల కొనుగోళ్లపై కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం ఏర్పాటు

సూర్యాపేట, వెలుగు : వడ్ల కొనుగోళ్లలో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెంటర్లలో సిబ్బంది, నిర్వాహకుల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే రైతులు 62814 92368 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. ఈ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తుందన్నారు. అలాగే వృద్ధ కళాకారులు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం తమ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 లోపు జిల్లా ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందజేయాలని సూచించారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని, నిర్ణీత తేమ శాతం ఉన్న వడ్లను వెంట వెంటనే కొనుగోలు చేయాలని నల్గొండ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆదేశించారు. నల్గొండ మండలంలోని బత్తాయి మార్కెట్, చందనపల్లిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినా, వడ్లు తీసుకున్నా హమాలీల లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. వడ్లు కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఓపీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసి డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2,22,483 టన్నుల వడ్లు కొని రైతులకు రూ.297 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై డీఎం నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే చర్యలు తప్పవు

సూర్యాపేట, వెలుగు : ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. జిల్లా పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలోని మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో యాంటీ ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురైన వారు మానసికంగా ఇబ్బందులు పడుతారన్నారు. స్టూడెంట్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాల్పడినట్లు తేలితే ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు గరిష్టంగా పదేళ్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. డీఎస్పీ నాగభూషణం, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్, సీఐ రాజశేఖర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శారద, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కళాశాల వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ఉరి వేసుకొని కండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య

దేవరకొండ, వెలుగు : ఉద్యోగం నుంచి సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, మద్యానికి బానిస కావడంతో ఓ కండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగింది. పట్టణంలోని శివాజీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొత్తపల్లి ఎఫ్రేం (36) దేవరకొండ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడంతో నాలుగు నెలల క్రితం ఉన్నతాధికారులు సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అప్పటి నుంచి తాగుడుకు బానిస అయ్యాడు. అతడి భార్య మంగళవారం రాత్రి తన సోదరి ఇంటికి వెళ్లి బుధవారం ఉదయం తిరిగి వచ్చింది. ఎంత సేపు డోర్లు కొట్టినా తీయకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలించింది. వారంతా డోర్లు పగులగొట్టి చూడగా ఎఫ్రేం ఉరి వేసుకొని కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

హాలియా, వెలుగు : అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా అనుములలో బుధవారం జరిగింది. ఎస్సై డి.క్రాంతికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... కనగల్ మండలం జి.యడవల్లికి చెందిన పోలె సౌజన్య (29)కు కొన్నేళ్ల క్రితం అనుములకు చెందిన తక్కెళ్ల శ్రీనుతో వివాహమైంది. పెళ్లి టైంలో కట్నం కింద రూ. 50 వేలు, 4 తులాల బంగారం, 30 గుంటల భూమి ఇచ్చారు. భూమిని అమ్మి డబ్బు తీసుకురావాలని అత్తింటి వారు వేధిస్తున్నారు. దీంతో బుధవారం సౌజన్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటరాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్ని రంగాల్లో విఫలం

సూర్యాపేట వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్ని రంగాల్లో విఫలం అయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. బుధవారం సూర్యాపేటలో జరిగిన నియోజవకర్గ నాయకుల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. టీచర్లు లేక సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు మూసేస్తున్న ప్రభుత్వం టార్గెట్లు విధించి మరీ మద్యం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కంను పెంచుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజావ్యతిరేకత పెరిగిన ప్రతీసారి కొత్త సమస్యను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చిగ్రామాల్లో అనేక సమస్యలు సృష్టించారని, సెటిల్మెంట్ల పేరుతో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేదలకు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండ్లు ఇస్తూ సూర్యాపేటలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం 2.40 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 40 వేల ఇండ్లు కూడా కట్టలేకపోయిందన్నారు. మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలోని ప్రతి దళిత ఫ్యామిలీకి దళితబంధు ఇప్పించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. మండల అధ్యక్షుడు పందిరి రాంరెడ్డి, పేర్వాల లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, వెన్న శశిధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్కూరి కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కాప రవికుమార్ పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలపై చర్య తీసుకోవాలి

దేవరకొండ, వెలుగు: నకిలీ పత్తి విత్తనాలను అమ్మిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ చందంపేట మండలం పెద్దమూల రైతులు బుధవారం దేవరకొండ ఏడీఏ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేస్తే నకిలీ విత్తనాల కారణంగా ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలపై చర్యలు తీసుకోవడంతో పాటు, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం ఏడీఏ వీరప్పకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చందంపేట సీపీఐ కార్యదర్శి వెంకటయ్య, భిక్షం పాల్గొన్నారు.

రైతు సమస్యలపై ఆందోళనలు చేస్తాం

యాదాద్రి, వెలుగు : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఆందోళనలు చేస్తామని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెప్పారు. బుధవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్, పోడు భూముల సమస్య, రుణమాఫీ, రైతు బంధు సహా అనేక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించన్నునట్లు ప్రకటించారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోఆర్డినేటర్ల నియామకం

నల్గొండ, వెలుగు : రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, యాదాద్రికి జానారెడ్డి, సూర్యాపేట జిల్లాకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. 

బీజేపీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదాద్రి, వెలుగు : బీజేపీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా పిట్టల అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు బుధవారం నియమాక పత్రం అందజేశారు. అనంతరం పిట్టల అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.