కరోనా దెబ్బకు డీడీ న్యూస్ మూసివేత

కరోనా దెబ్బకు డీడీ న్యూస్ మూసివేత

కరోనా దెబ్బకు దేశంలో రోజూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ న్యూస్ చానెల్‌కు చెందిన వీడియో జర్నలిస్ట్ కరోనాతో చనిపోయాడు. ఢిల్లీలోని దూరదర్శన్ న్యూస్ చానెల్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న యోగేశ్ కుమార్ బుధవారం గుండెపోటుతో మరణించాడు. అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆ చానెల్‌లో అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు చేయనున్నారు.

‘డీడీ న్యూస్ చానెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. శానిటైజేషన్ చేసిన తర్వాత ఆఫీసును త్వరలోనే తెరుస్తాం. అయితే ఆఫీస్ తాత్కాలికంగా మూసివేయడం వల్ల వార్తాప్రసారాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం’ అని డీడీ న్యూస్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.

‘వీడియో జర్నలిస్ట్ యోగేశ్ కుమార్ బుధవారం తన ఇంట్లోనే గుండెపోటుతో చనిపోయాడు. మేం మా సిబ్బందిని వారంలో రెండు రోజులు మాత్రమే డ్యూటీకి రావాలిని చెప్పాం. కానీ, యోగేష్ మాత్రం ప్రతిరోజు ఆఫీసుకు వచ్చేవాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమయ్యాడు. యోగేష్ మరణంతో డీడీ న్యూస్ ఒక ప్రొఫేషనల్‌ను కోల్పోయింది. యోగేష్ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కూడా అంకితభావంతో విధులు నిర్వర్తించేవాడు’ అని డీడీ న్యూస్‌కు చెందిన ఒక యాంకర్ తెలిపారు.

యోగేష్ మరణంతో కెమెరా విభాగానికి చెందిన మొత్తం సిబ్బందిలో కొంతమందిని గురువారం డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో పరీక్షించారు. మరికొంతమందిని శుక్రవారం పరీక్షించనున్నట్లు డీడీ న్యూస్ వర్గాలు తెలిపాయి.

For More News..

నాలుగేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. ఇప్పుడు ఆత్మహత్య