మధ్యాహ్న భోజనంలో ఎలుక: విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్న భోజనంలో ఎలుక: విద్యార్థులకు అస్వస్థత

ఉత్తర ప్రదేశ్: ‘మిడ్ డే మిల్స్’ తిన్న విద్యార్థులు హాస్పిటలైస్డ్ అయ్యారు. విద్యార్థులందరికీ వాంతులు అవగా… 10మంది విద్యార్థులు, ఒక టీచర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి మామూలుగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ముజఫరాబాద్ లో జరిగింది. మెనూ ప్రకారం మంగళవారం విద్యార్థులకు వడ్డించిన పప్పులో చనిపోయిన ఎలుక ఉండటంతో ఆహారం విశంగా మారింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సతీష్ దేవివేడి స్పందించారు…  మిడ్ డే మిల్స్ సరఫరా చేస్తున్న ‘జన్ కళ్యాణ్’ అనే NGO సంస్థ పై తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకుగాను FIR నమోదు చేసినట్లు చెప్పారు.