
జడ్చర్ల, వెలుగు: కర్రీ పఫ్లో చచ్చిన పాము కనిపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం జౌకీనగర్కు చెందిన అలుగొండ శ్రీశైల తన పిల్లల కోసం మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని శ్రీలక్ష్మీ బెంగళూరు బేకరీ అండ్ స్వీట్స్ షాపులో రెండు కర్రీ పఫ్లుకొనుగోలు చేసింది.
సాయంత్రం 5 గంటల సమయంలో బడి నుంచి పిల్లలు ఇంటికి రావడంతో వారికి ఒక కర్రీ పఫ్ ఇచ్చి, మరొకటి తాను తింటుండగా అందులో చనిపోయిన పాము పిల్ల కనిపిందింది. శ్రీశైల ఆందోళనతో బేకరీకి వచ్చి షాపు యాజమానితో గొడవకు దిగింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ కమలాకర్ ఈ విషయంపై ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫోన్లో సమాచారం అందజేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.