ఆశలతో వెళ్లి అసువులు బాస్తున్నరు.. విదేశాల్లో మూడు రోజులకో భారత విద్యార్థి మృతి

ఆశలతో వెళ్లి అసువులు బాస్తున్నరు.. విదేశాల్లో మూడు రోజులకో భారత విద్యార్థి మృతి
  • విద్య, ఉపాధి కోసం అమెరికా, కెనడా వంటి దేశాలకు భారత యువత
  • అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, కాల్పుల్లో మృతి
  • ఏడేండ్లలో 842 మంది మృతి, అమెరికాలోనే అత్యధికంగా 141 మంది..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్న భారత యువకులు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులతో కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే.. రోడ్డు ప్రమాదాలు, దుండగుల కాల్పుల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా సగటున ప్రతి మూడు రోజులకో భారత విద్యార్థి విదేశాల్లో కన్నుమూస్తున్నాడు. ఇందులో అమెరికాలోనే ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల కీలక వివరాలు వెల్లడించింది. 2018 నుంచి 2024 మధ్య మొత్తం 842 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చనిపోయినట్లు తెలిపింది.

విదేశాల్లో 1.33 మిలియన్ల మంది భారత విద్యార్థులు
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలి.. అక్కడే ఉద్యోగం సాధించాలని చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆశలతో అమెరికా, కెనడాతో పాటు పలు ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇలా 2024 జనవరి నాటికి 1.33 మిలియన్ల మంది భారత విద్యార్థులు విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. చదువుతో పాటు పార్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారిని మానసిక, ఆరోగ్య సమస్యలకు తోడు భద్రతాపరమైన భయాలు వెంటాడుతున్నాయి. ఎక్కువగా జాతి వివక్షతో దాడులు, కాల్పులు పెరిగిపోయాయి. 

ఏడేండ్లలో 842 మంది స్టూడెంట్లు మృతి
అమెరికా సహా ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు చనిపోతున్న దేశాల లిస్ట్‌‌‌‌‌‌‌‌లో అమెరికా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది. గత ఏడేండ్ల వ్యవధిలో అమెరికాలో అత్యధికంగా 141 మంది భారత విద్యార్థులు చనిపోయారు. ఆ తరువాతి స్థానంలో దుబాయ్‌‌‌‌‌‌‌‌ 133 మంది, కెనడా 119 మంది, ఖతార్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియాలో 57 మంది చొప్పున మొత్తం ఏడేండ్లో 842 మంది చనిపోయినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వీరిలో 96 శాతం మంది ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా.. మిగిలిన నాలుగు శాతం స్టూడెంట్లు దుండగుల కాల్పుల్లో మృతి చెందారు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీఎన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి నగర్‌‌‌‌‌‌‌‌ టీచర్స్‌‌‌‌‌‌‌‌ కాలనీకి చెందిన పోలె చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (27) 2023లో అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌‌‌‌‌‌‌‌లో డెంటల్‌‌‌‌‌‌‌‌ సర్జరీలో మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చదువుతూ, డల్లాస్‌‌‌‌‌‌‌‌లోని ఓ గ్యాస్‌‌‌‌‌‌‌‌ ఫిల్లింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో పార్ట్‌‌‌‌‌‌‌‌టైం జాబ్‌‌‌‌‌‌‌‌ చేస్తుండేవాడు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 4న ఉదయం 9 గంటలకు ఓ నల్ల జాతీయుడు తన వాహనంలో గ్యాస్‌‌‌‌‌‌‌‌ నింపుకునేందుకు వచ్చి చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే చనిపోయాడు.

చంచల్‌‌‌‌‌‌‌‌గూడ చావనికి చెందిన షెరాజ్‌‌‌‌‌‌‌‌ మెహతాబ్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ (25) తన తండ్రి అల్తాఫ్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌తో కలిసి అమెరికాలోని చికాగోలో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో పనిచేస్తున్న మెహతాబ్‌‌‌‌‌‌‌‌ అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.