
తిరుపతి: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో టీటీడీ నిర్వహించిన ‘గో మహా సమ్మేళన్’లో పాల్గొన్న రాందేవ్.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. గో మహా సమ్మేళన్లో పెట్టిన తీర్మానాలను అమలు చేయాలన్నారు. ఈ సమ్మేళానికి రావాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తనను ఆహ్వానించారని తెలిపారు. టీటీడీ చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను మెచ్చుకున్న రాందేవ్.. ఆలయ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు.