రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి..ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి : సీపీఎం

రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి..ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలి : సీపీఎం
  • సీఎం రేవంత్​రెడ్డికి సీపీఎం లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెస్లీ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వం 31 జిల్లాల్లోని 365 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని, రాష్ట్రంలోని అన్ని మండలాలనూ గుర్తించి రైతులను ఆదుకోవాలని కోరారు.

పంటలు నష్టపోయిన రైతులకు వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.30 వేల చొప్పున పరిహారం నేరుగా ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. రైతులతోపాటు డ్వాక్రా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేయాలని కోరారు. రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డుదారులకు బియ్యంతోపాటు పప్పు, నూనె, చక్కెర సహా 14 రకాల నిత్యావసర సరుకులతో ఉచిత కరువు ఉపశమన కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని, బియ్యం కోటాను వ్యక్తికి 12 కిలోలకు పెంచాలని పేర్కొన్నారు.

కరువు నివారణకు కేంద్రం నుంచి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ సాధించేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. గ్రామాల్లో తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయానికి నాణ్యమైన త్రీ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరారు.