
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే ఈ షో, ఎప్పుడు ప్రారంభమైనా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. స్థానిక భాషలకు అనుగుణంగా నిర్వహకులు ఈ షోను రూపొందిస్తుండగా, వివిధ ఫార్మాట్లలో దీనిని ప్రసారం చేస్తున్నారు. ఈ సారి హిందీలో 'బిగ్ బాస్ 19' ( Bigg Boss 19 )సీజన్ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan )హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
సల్మాన్ పారితోషికంపై ఆసక్తికర చర్చ
సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హోస్ట్( Salman Khan )గా ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ పై చర్చ జరగడం సహజమే. ఈ సీజన్ కోసం సల్మాన్ ఏకంగా రూ. 120 నుంచి రూ. 150 కోట్ల మధ్య తీసుకుంటున్నారని సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. మొత్తం 15 వారాల పాటు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తారు కాబట్టి, ఒక్కో వారాంతానికి రూ. 8 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లతో పోలిస్తే, బిగ్ బాస్ 19 సీజన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.
►ALSO READ | HHVM Review : 'హరి హర వీరమల్లు' అభిమానుల అంచనాలను అందుకుందా?
గతంలో బిగ్ బాస్ OTT2కి హోస్ట్‌గా చేసినప్పుడు సల్మాన్ రూ. 96 కోట్లు అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 17 కోసం రూ. 200 కోట్లు, బిగ్ బాస్ 18 కోసం దాదాపు రూ. 250 కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈసారి ఇతర హోస్ట్‌లు కూడా ఉన్నప్పటికీ, గత OTT సీజన్‌తో పోలిస్తే సల్మాన్ ఈ వెర్షన్‌కు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
కొత్త ఫార్మాట్‌లో బిగ్ బాస్ 19
ఈ బిగ్ బాస్ సీజన్ 19 దాదాపు 5 నెలల పాటు కొనసాగనుంది! మొదటి మూడు నెలలు సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్లో షోను నడిపిస్తారు. ఆ తర్వాత, గెస్ట్ హోస్ట్‌లు బాధ్యతలు స్వీకరిస్తారు. వారిలో ప్రముఖులు ఫరా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ మిగతా రెండు నెలలు ఈ షోను హోస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సరికొత్త ఫార్మాట్ షోపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సీజన్ ఆగస్టు 30 నుంచి జియో సినిమాలో ప్రసారం కానుంది. మొదట ఓటీటీలో ప్రసారమై.. గంటన్నర తర్వాత, కలర్స్ టీవీలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.. అంటే, డిజిటల్ ప్రేక్షకులు ముందుగా ఈ షోను వీక్షించవచ్చు.
ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేది వీరే?
కంటెస్టెంట్లు ఇంకా లాక్ కాకపోయినప్పటికీ, 20 మంది ప్రముఖుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వారిలో గౌతమి కపూర్, ధీరజ్ ధూపర్, అలీషా పన్వర్, ఖుషీ దూబే, గౌరవ్ తనేజా, మిస్టర్ ఫైసు, అపూర్వ ముఖిజా, పురవ్ ఝా, గౌరవ్ ఖన్నా, ధనశ్రీ వర్మ, శ్రీరామ్ చంద్ర, అర్షిఫా ఖాన్, మిక్కీ మేకోవర్ తదితరులు ఈ షోలో పాల్గొనేందుకు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ఎవరు ఫైనల్ అవుతారు, ఎవరు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెడతారు అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. మొత్తంగా, సల్మాన్ ఖాన్ హోస్టింగ్, భారీ బడ్జెట్, కొత్త ఫార్మాట్, ఆసక్తికరమైన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ 19 సీజన్ ఈసారి మరింత రసవత్తరంగా మారడం ఖాయం అంటున్నారు అభిమానులు.