
సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) 170వ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. 'జైభీమ్(Jai Bheem)' డైరెక్టర్ టి.జె.జ్ఞాన్ వేల్(TJ Gnanvel) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే 'జైలర్(Jailer)' షూటింగ్ ను రజనీ త్వరలో 170 ఘూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు కొలిక్కి రావడంతో హీరోయిన్ ఎంపికపై కొన్ని రోజులుగా తర్జన భర్జన నడుస్తోంది. హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై రకరకాల డిబేట్లు నడుస్తున్నాయి.
కోలీవుడ్ నటిని తీసుకోవాలా? పాన్ ఇండియా అప్పీల్ ఉన్న హీరోయిన్ తీసుకోవాలా? అన్న దానిపై చిత్ర యూనిట్ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. రజనీకి జోడీగా దీపికా పదుకొణే(Deepika padukone) అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూవీలో హీరోయిన్ పాత్ర కూడా సందేశాత్మకంగా ఉంటుందట. ఆ పాత్రకు బాగా పాపులర్ అయిన నటి అయితే ఆ రోల్ జనాల్లోకి బలంగా వెళ్తుందని భావించి దీపికని లైన్ లోకి తెస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. ప్రస్తుతం దీపికా పదుకొణే సౌత్ సినిమాలపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్(Prabas) సరసన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 AD (Kalki 2898 AD)లో నటిస్తోంది.