
రోహిత్ శెట్టి(Rohit Shetty) తీసిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దీపికా(Deepika padukone) సౌత్ ఇండియన్ అమ్మాయిగా కనిపించింది. 2013లో వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజే నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో దక్షిణాది వారిని చూపించిన తీరు రియలిస్టిక్‌గా లేదని రివ్యూలు వచ్చాయి. ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా ఓవర్ హైప్ చేసి చూపించారని కొందరు పెదవి విరిచారు.
మరీ ముఖ్యంగా మీనమ్మగా చేసిన హీరోయిన్ కామెడీ వెగటుగా ఉందని కామెంట్స్ చేశారు. కట్ చేస్తే.. దీపిక కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. సినిమాలో ఎమోషన్ పండటంతో కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ మూవీ సాంగ్స్ అప్పట్లో యూత్‌ను ఊపేశాయి. దీంతో సినిమాపై వచ్చిన నెగిటివిటీ ప్రేక్షకులను థియేటర్లలోకి రాకుండా ఆపలేకపోయింది.
తాజాగా ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీపికా ఆ రోజుల్ని గుర్తుచేసుకుంది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తనకెంతో ప్రత్యేకమని తెలిపింది.