పఠాన్ సక్సెస్.. ఆనందంతో దీపిక కన్నీళ్లు

పఠాన్ సక్సెస్..  ఆనందంతో దీపిక కన్నీళ్లు

బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజు నుంచి ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర బృందం ముంబైలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు దీపిక ఎమోషనల్ అయ్యింది. మీ అందరి ప్రేమ, ప్రశంసలు చూసి చాలా ఆనందంగా ఉందని చెప్పింది. సినిమా విడుదలైన రోజు థియేటర్‭కు వెళ్లి అభిమానుల రెస్పాన్స్ చూడాలనుకున్నానని ఆ రోజు వీలు కాలేదన్న ఆణె.. ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఒక పండగలా అనిపిస్తుందని చెప్పింది. 

నిజాయితీగా చిత్తశుద్దితో పనిచేస్తే కచ్చితంగా బహుమతి ఇస్తుందని పఠాన్ రుజువు చేసిందంటూ దీపిక సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచి ఇప్పటి వరకు రూ. 400కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే బాలీవుడ్‌లో `కేజీఎఫ్‌2` ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డులను బ్రేక్‌ చేసి హిందీ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ వీకెండ్‌ గ్రాస్ ఓపెనర్ గా నిలిచింది.