
బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అతి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇపుడు స్టార్ హీరో రన్వీర్ సింగ్ పెళ్ళిచేసుకొని దాంపత్యజీవితాన్ని కూడా హాయిగా జీవిస్తోంది. అయితే.. పెళ్లి తరువాత హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గిపోతాయి అంటారు. కానీ, దీపికా మాత్రం ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇక దీపికా ఇటీవల తన మొదటి ప్రెగ్నెన్సీ ని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈమధ్య జరిగిన ఎలక్షన్స్ లో బేబీ బంప్ తో కనిపించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల దీపికా తన సొంత ఫ్యాషన్ బిజినెస్ 82 ఈస్ట్ ఆఫ్‌లైన్ స్టోర్‌లో మరోసారి బేబీ బంప్‌తో కనిపించింది. ఆ సమయంలో ఆమె పసుపు రంగు గౌను ధరించింది. దాంతో ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆమె ధరించిన పసుపు రంగు గౌనుకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో ఆ గౌనును సోమవారం వేలానికి ఉంచగా క్షణాల్లో అమ్ముడైపోయింది ఆ గౌను. అది కూడా రూ.34,000 లకు. అయితే ఈ గౌను వేలంలో వచ్చిన డబ్బును ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌కు చారిటీగా ఇవ్వనున్నారట. దీంతో దీపికాపై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక దీపికా పడుకునే సినిమాల విషయనికి వస్తే.. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్కి 2898 AD సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకేక్కిస్తుండగా.. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అమితాబ్, కమల్, దిశా పాఠాని కీ రోల్ చేస్తున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్స్ లోకి రానుంది. టీజర్స్, పోస్టర్స్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత ఎంతటి విజయాన్ని సాదిస్తుందో చూడాలి.