అదృశ్యమైన దీప్తిశ్రీ శవమై తేలింది

అదృశ్యమైన దీప్తిశ్రీ శవమై తేలింది

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి సూరాడ దీప్తిశ్రీ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమైన చిన్నారి కోసం మూడు రోజులుగా పోలీసులు గాలించగా.. కాకినాడలోని ఇంద్రపాలెం డ్రెయిన్‌లో దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. సవతి తల్లి శాంతికుమారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు పోలీసులు.

కాకినాడకు చెందిన సత్యశ్యామ్‌ ప్రసాద్‌ కుమార్తె దీప్తిశ్రీ స్థానిక జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. పాప తల్లి మూడేళ్ల క్రితం చనిపోవడంతో.. శ్యామ్‌ ప్రసాద్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య శాంతకుమారి, కుమారుడితో కలిసి సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. దీప్తిశ్రీ తూరంగిలోని పగడాల పేటలో మేనత్త దగ్గర ఉంటోంది. రోజూ మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారిని.. మధ్యాహ్న భోజనసమయంలో స్కూల్ గ్రౌండ్ లో ఆడుకుంటూ కన్పించకుండా పోయింది.

కూతురు కన్పించకుడా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు…సవతి తల్లి శాంతి కుమారిని ప్రశ్నించారు. మొదట తెలియదని చెప్పడంతో..తమదైన శైలిలో  అడగటంతో అసలు విషయం చెప్పింది. తన కుమారుడి కంటే మొదటి భార్య కుమార్తె అయిన దీప్తిశ్రీకి భర్త ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే కోపంతో చంపినట్లు ఒప్పుకుందని తెలిపారు జిల్లా ఎస్పీ నయీం అస్మి.  అంతేకాదు ఈ హత్యలో వేరే ఎవరి ప్రమేయం లేదని.. శాంతికుమారే హతమార్చిందన్నారు. దీప్తిశ్రీని సవతి తల్లి తీసుకురావడంతో పాటు గోనెసంచి మూటను ఉప్పుటేరు వంతెనపై పెట్టిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.