పవన్ పై పరువు నష్టం కేసు విచారణ.. జులై 25కు వాయిదా

పవన్ పై పరువు నష్టం కేసు విచారణ.. జులై 25కు వాయిదా

వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ పై ఓ మహిళా వాలంటీర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణను విజయవాడ సివిల్ కోర్టు జూలై 25 కు  వాయిదా వేసింది. పవన్ వ్యాఖ్యలు మనో వేదనకు గురిచేశాయని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజయవాడ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలింటీర్ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా  తామేంతో సేవ చేస్తున్నామని ఇళ్లకు వెళ్ళి తెల్లవారుజామునే పెన్షన్ ఇస్తుంటే.. తమపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తమ సేవలను పవన్ కళ్యాణ్ గుర్తించాలన్నారు.  నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని.. కరోనా సమయంలో అందరూ తలుపులు మూసేసి ఉంటే తాము ప్రజలకు అండగా ఉన్నామన్నారు. పవన్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.. ప్రస్తుతం తాను ఒకే ఒక్క పిటిషన్ వేశానని..మున్ముందు మరికొందరు పిటిషన్ వేస్తారని  తెలిపారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.