ప్రధాని మోడీకి పరువునష్టం నోటీసు

ప్రధాని మోడీకి పరువునష్టం నోటీసు

వెస్ట్ బెంగాల్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పరువు నష్టం నోటీసు పంపించారు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు. వెస్ట్ బెంగాల్ లో ఏడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 15న డైమండ్ హార్బర్ లో పర్యటించారు ప్రధాని మోడీ. అక్కడ బహిరంగ సభలో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఆమె అల్లుడు-టీఎంసీ లీడర్ అభిషేక్ ముఖర్జీలపై విమర్శలు చేశారు. ఇష్టమొచ్చినట్టుగా పాలిస్తామనడానికి బెంగాల్ వారి జాగీరు కాదని మోడీ అన్నారు. దీనిపై టీఎంసీ అభ్యంతరం చెబుతోంది.

తమ మనోభావాలను కించపరిచారనీ.. తమ పరువుకు నష్టం కలిగించారని ఆరోపిస్తూ… నరేంద్రమోడీకి డిఫమేషన్ నోటీస్ పంపించారు అభిషేక్ ముఖర్జీ. లాయర్ ద్వారా నోటీసు పంపించినట్టు చెప్పారు.