స్వదేశీ టెక్నాలజీతో బ్రహ్మోస్ క్షిపణి తయారీ షురూ.. ఫస్ట్ బ్యాచ్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభం

స్వదేశీ టెక్నాలజీతో బ్రహ్మోస్ క్షిపణి తయారీ షురూ.. ఫస్ట్ బ్యాచ్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభం

దేశ రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం. స్వదేశీ టెక్నాలజీతో బ్రహ్మోస్​ క్షిపణుల తయారీ ప్రారంభం అయింది. ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా  రక్షణరంగంలో దేశీయ తయారీ సామర్థ్యాలు పెరగడమే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి భారత్​ ఎదుగుతోంది. శనివారం ( అక్టోబర్​18) లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రొడక్షన్ యూనిట్‌లో తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.

బ్రహ్మోస్ ఏరోస్పేస్ భారత్,రష్యా సంయుక్త భాగస్వామ్య సంస్థ. ఈ యూనిట్‌లో తయారయ్యే సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్స్‌ను భారత సైన్యానికి అందజేయనున్నారు. ఈ క్షిపణులు భూమి, సముద్రం, గగనం తలం నుంచి ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.

దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా గొప్ప మైలురాయి అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  భారత్​ ఇప్పుడు రక్షణ సామగ్రిని దిగుమతి  చేసుకునే దేశం కాదు.. ప్రపంచానికి ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతోందన్నారు.