గుజరాత్ లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టిస్తది: రాజ్ నాథ్ సింగ్

గుజరాత్ లో  బీజేపీ సరికొత్త రికార్డు సృష్టిస్తది: రాజ్ నాథ్ సింగ్

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించబోతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. వారి విశ్వాసమే బీజేపీకి మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందని చెప్పారు. ఖచ్చితంగా బీజేపీకి ఈసారి సీట్ల సంఖ్య పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ హవా..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూకుపోతుంది. గతంలో కంటే ఈసారి అత్యధిక సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ 150 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 17 స్థానల్లో, ఆప్ 7 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. 

తన రికార్డును తానే బ్రేక్ చేయనుందా..?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 150 సీట్లలో విజయం సాధిస్తే..బీజేపీ తన రికార్డును తానే బ్రేక్ చేసుకోనుంది.  గుజరాత్ లో 1995లో 121 సీట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ...1998లో 117 సీట్లను దక్కించుకుంది. ఆ తర్వాత 2002లో 127 సీట్లలో విజయం ఢంకా మోగించింది. 2007లో 117, 2012లో 115 సీట్లను సొంతం చేసుకుంది. 2017లో 99 సీట్లలో గెలిచి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం 2002లో సాధించిన సీట్ల రికార్డును బీజేపీ బద్దలు కొట్టనుంది.