
అబిడ్స్, వెలుగు: అబిడ్స్ లోని స్టాన్లీ మహిళ డిగ్రీ కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంటెండెన్స్ ఫీజుల పేరుతో హాల్ టికెట్ ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యం వేధిస్తున్నారంటూ… కాలేజ్ గేట్ ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే డిగ్రీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తున్నారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
తమకు హాల్ టికెట్ ఇచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని కళాశాల గేటు ముందు విద్యార్థులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కాలేజ్ యాజమాన్యం నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థులు కళాశాల కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అబిడ్స్ పోలీసులు కలుగజేసుకొని కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు హల్ టికెట్లు ఇప్పించారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.