ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో గాలి నాణ్యత

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో గాలి నాణ్యత

ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం నెల‌కొంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో పూర్ కాటగిరీలో గాలి నాణ్యత 3301గా నమోదైంది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం  గురుగ్రామ్‌లో AQI 353 వద్ద ఉండగా, నోయిడాలో 351గా నమోదైంది. ఢిల్లీ యూనివర్సిటీ ఏరియాలో AIQ 314 ఉండగా, ఐఐటీ ఢిల్లీలో 176గా ఉంది. ఎయిర్ పోర్టు ప్రాంతంలో  గాలి నాణ్యత 309గా నమోదైంది.

గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. అదే 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని.. 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యతగా పరిగణిస్తారు. ఇక  201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని అంటారు.  301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని.. 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.