
ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. మరోసారి బాంబు బెదిరింపులతో ఢిల్లీ ఉలిక్కిపడింది.. ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ పోలిసులకు మెయిల్స్ వచ్చాయి. ఎయిర్ పోర్టుతోపాటు రెండు స్కూళ్లు, పలు సంస్థలలో కూడా బాంబులు పెట్టాం.. పేల్చివేస్తామంటూ దుండగులు మెయిల్స్ పంపించారు. దీంతో ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎయిర్ పోర్టులో తనిఖీ చేపట్టారు. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు బాంబు బెదిరింపులు వచ్చిన స్కూళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు.
ద్వారకలోని సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్, కుతుబ్ మినార్ సమీపంలోని సర్వోదయ విద్యాలయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని అయితే తనిఖీలు చేపట్టిన తరువాత ఈ బెదిరింపులు ఫేక్ అని తేల్చారు పోలీసులు.
►ALSO READ | తొక్కిసలాట ఘటనపై విజయ్ TVK పార్టీ సంచలన నిర్ణయం
బాంబు బెదిరింపులతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది, బాంబు స్క్వాడ్స్ గ్రూప్లు ఎయిర్పోర్టు, స్కూళ్లలో తనిఖీలు నిర్వహించి ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించడం లేదని ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది అధికారులు తెలిపారు.