క్రాకర్స్ కాల్చొద్దు.. కలసి పూజ చేద్దాం

క్రాకర్స్ కాల్చొద్దు.. కలసి పూజ చేద్దాం

న్యూఢిల్లీ: దీపావళి పండుగ రాబోతోంది. దీపావళి అనగానే అందరికీ టపాసులు గుర్తుకొస్తాయి. లక్ష్మీ బాంబులు, విష్ణు చక్రాలు, తోక పటాకులు, ఉల్లిగడ్డ బాంబులు, సుర్‌‌సుర్ బాణాలు పేలుస్తూ చిన్నాపెద్దా దివాళీని గ్రాండ్‌‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే పటాసులు పేల్చడం వల్ల వెలువడే పొగతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి దీపావళికి క్రాకర్స్ కాల్చొద్దని ప్రతి ఏడాది నిపుణులు సూచిస్తుంటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా దీపావళిని మామూలుగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రజలను కోరారు.

‘గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా దివాళీకి క్రాకర్స్ కాల్చబోమని ఢిల్లీ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలి. ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో పండుగను సెలబ్రేట్ చేసుకుందాం. ఈసారి 2 కోట్ల మంది ప్రజలతో కలిసి పండుగను జరుపుకుందాం. ఈసారి లక్ష్మీ పూజ నిర్వహణకూ ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు తమ ఇళ్ల వద్ద చూడొచ్చు. బయటకు వచ్చి క్రాకర్స్ కాల్చుతూ పర్యావరణాన్ని హాని చేసే బదులు ఇళ్లల్లోనే ఉంటూ పండుగను నిరాడంబరంగా జరుపుకోవడం మంచిది’ అని కేజ్రీవాల్ చెప్పారు.