ఢిల్లీలో బాణసంచా విక్రయాలు బ్యాన్

ఢిల్లీలో బాణసంచా విక్రయాలు బ్యాన్

ఢిల్లీలో మరోసారి టపాసులపై ఆప్ ప్రభుత్వం నిషేధం విధించింది. వచ్చే ఏడాది జవనరి ఒకటి వరకు బ్యాన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఢిల్లీ టపాసుల తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుందని ట్విట్టర్ లో తెలిపారు. ఆన్ లైన్ ల్లో కూడా బాణసంచా విక్రయాలపై నిషేధం  వర్తిస్తుందన్నారు. సాధారణంగా ఢిల్లీలో వాయుకాలుష్యం మిగతా సిటీలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రాకర్స్ వల్ల గాలి నాణ్యత మరింత తగ్గుతోంది. దీపావళి సందర్భంగా ఢిల్లీలో కాలుష్యం తీతవ్ర స్థాయిలోకి చేరుకుంటుంది. దీంతో గతేడాది సెప్టెంబర్ 28 నుంచి 2022 జనవరి 1 వరకు నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు కూలా తీసుకుంది.

దీపావళి సందర్భంగా ఢిల్లీ కాలుష్యం ప్రమాదకరస్థాయికి మించి చేరుతుండటంతో బాణాసంచా అమ్మకాలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కారు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరు 28 నుంచి 2022 జనవరి 1 వరకు బాణసంచా విక్రయాలు, వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించి టపాసులు పేల్చిన వారిపై చర్యలు కూడా తీసుకుంది.