ముంబై జోరుకు ఢిల్లీ బ్రేక్‌‌‌‌.. 6 వికెట్లతో క్యాపిటల్స్​ గెలుపు

ముంబై జోరుకు ఢిల్లీ బ్రేక్‌‌‌‌.. 6 వికెట్లతో క్యాపిటల్స్​ గెలుపు
  • మిశ్రా మ్యాజిక్‌
  • అదరగొట్టిన అమిత్​, ధవన్‌‌

మెరుపు ఆరంభాలు లభిస్తున్నా.. మిడిలార్డర్‌‌ ఫెయిల్యూర్‌‌తో భారీ స్కోరు చేయలేకపోతున్న డిఫెండింగ్‌‌ చాంప్‌‌ ముంబై ఇండియన్స్‌‌కు షాక్‌‌..! లాస్ట్‌‌ రెండు మ్యాచ్‌‌ల్లో చిన్న టార్గెట్లను కాపాడుకున్న రోహిత్‌‌సేన ఢిల్లీ సూపర్‌‌ బౌలింగ్‌‌ ముందు తలొగ్గింది. వెటరన్‌‌ స్పిన్నర్‌‌ అమిత్‌‌ మిశ్రా (4/24), యంగ్‌‌ పేసర్‌‌ అవేశ్‌‌ ఖాన్‌‌ (2/15)  దెబ్బకు డీలా పడింది.  కెప్టెన్‌‌ రోహిత్‌‌, సూర్యకుమార్‌‌ జోరు మీద ఉండగా ఏడో ఓవర్లో  67/1తో భారీ స్కోరుపై కన్నేసిన ముంబై  ఓ దశలో 84/6తో దిక్కుతోచని స్థితిలో నిలిచింది..! ఇషాన్‌‌ కిషన్‌‌ (26), జయంత్‌‌ యాదవ్‌‌ (23) పోరాటంతో చివరకు ప్రత్యర్థి ముందు 138 రన్స్‌‌ టార్గెట్‌‌ ఉంచింది..!  దాన్ని కాపాడుకునేందుకు లాస్ట్​ ఓవర్‌‌ వరకూ ప్రయత్నించినా సక్సెస్‌‌ కాలేకపోయింది.  సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న శిఖర్‌‌ ధవన్‌‌ (42 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 45) పోరాటంతో ఢిల్లీ లీగ్‌‌లో మూడో విక్టరీ సొంతం చేసుకుంది..! 
 
చెన్నై: గత సీజన్‌‌‌‌ ఫైనలిస్ట్‌‌‌‌ల మధ్య జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌దే పైచేయి అయింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్‌‌‌‌ జోరుకు ఢిల్లీ బ్రేక్‌‌‌‌ వేసింది. బౌలర్ల అద్భుత పెర్ఫామెన్స్‌‌‌‌కు తోడు బ్యాటింగ్‌‌‌‌లోనూ రాణించిన ఆ జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఆరు వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది.  ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 రన్స్‌‌‌‌ చేసింది. రోహిత్‌‌‌‌ శర్మ (30 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. సూర్యకుమార్‌‌‌‌ (15 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లతో 24) స్టార్టింగ్‌‌‌‌లో మెరుపులు మెరిపించాడు.  అనంతరం ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 138 రన్స్‌‌‌‌ చేసి గెలిచింది. ధవన్‌‌‌‌తో పాటు స్టీవ్‌‌‌‌ స్మిత్ (33), లలిత్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (22 నాటౌట్) రాణించారు.  మిశ్రాకు ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు దక్కింది.

రోహిట్‌‌‌‌.. మిడిల్‌‌‌‌ మళ్లీ ఢమాల్‌‌‌‌
ముంబైకి మరోసారి మంచి ఆరంభం లభించినా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుసగా నాలుగో మ్యాచ్‌‌‌‌లోనూ నార్మల్‌‌‌‌ స్కోరుకే పరిమితం అయింది. టాస్‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌ ఎంచుకున్న ఇండియన్స్‌‌‌‌కు స్టోయినిస్‌‌‌‌ మూడో ఓవర్లోనే షాకిచ్చాడు. ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్‌‌‌‌ క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ (2)ను కాట్‌‌‌‌ బిహైండ్‌‌‌‌ చేసి ఢిల్లీకి ఫస్ట్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ ఇచ్చాడు. అయితే, ఆరంభంలో కాస్త ఇబ్బందిగా కనిపించిన రోహిత్‌‌‌‌ ఒక్కసారిగా జోరు పెంచాడు. అశ్విన్‌‌‌‌ వేసిన నాలుగో ఓవర్లో 4,6తో టచ్‌‌‌‌లోకి వచ్చాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన సూర్యకుమార్‌‌‌‌ కూడా బౌండ్రీ  కొట్టడంతో ఆ ఓవర్లో 15 రన్స్‌‌‌‌ వచ్చాయి. ఆపై, రబాడ బౌలింగ్‌‌‌‌లో సూర్య ఫోర్‌‌‌‌ రాబట్టగా.. హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ లాంగాఫ్‌‌‌‌ మీదుగా భారీ సిక్స్‌‌‌‌ కొట్టాడు. ఆరో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన మిశ్రాకు సూర్య వరసగా రెండు బౌండ్రీలతో వెల్‌‌‌‌కమ్‌‌‌‌ చెప్పగా.. పవర్‌‌‌‌ప్లేలో ముంబై 55/1తో మెరుగ్గా కనిపించింది. అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్‌‌‌‌ ఇంకో సిక్సర్‌‌‌‌ కొట్టడంతో  ముంబై ఫుల్‌‌‌‌ జోష్‌‌‌‌లో కనిపించింది. కానీ, ఆ ఓవర్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ను ఆలస్యంగా కట్‌‌‌‌ చేయబోయిన సూర్య.. కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 58 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. అక్కడి నుంచి ముంబై పతనం మొదలైంది. తొమ్మిదో ఓవర్లో  రోహిత్‌‌‌‌తో పాటు హార్దిక్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేసిన మిశ్రా ప్రత్యర్థిని చావు దెబ్బకొట్టాడు. కాసేపటికే క్రునాల్‌‌‌‌ పాండ్యా (1)ను లలిత్‌‌‌‌ యాదవ్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేయగా.. 12వ ఓవర్లో డేంజర్‌‌‌‌ మ్యాన్‌‌‌‌ పొలార్డ్‌‌‌‌ (2)ను మిశ్రా ఎల్బీ చేశాడు. దాంతో,  ఓ దశలో 67/1తో మెరుగ్గా కనిపించిన ముంబై 12 ఓవర్లకు 84/6తో పూర్తిగా డీలా పడింది. ఆ టీమ్‌‌‌‌ 100  రన్స్‌‌‌‌ చేయడం కూడా కష్టం అనిపించింది. ఈ టైమ్‌‌‌‌లో ముంబైని ఇషాన్‌‌‌‌, జయంత్‌‌‌‌ ఆదుకున్నారు. జోరుమీదున్న మిశ్రాను కొనసాగించకపోవడం వాళ్లకు ప్లస్‌‌‌‌ అయింది. స్టోయినిస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో జయంత్‌‌‌‌ ఫోర్‌‌‌‌ కొట్టగా.. అశ్విన్‌‌‌‌ ఓవర్లో సిక్స్‌‌‌‌, రబాడ బౌలింగ్‌‌‌‌లో ఫోర్‌‌‌‌ బాదిన ఇషాన్‌‌‌‌ స్కోరు 120 దాటించాడు. అయితే, తన కోటా కంప్లీట్‌‌‌‌ చేసేందుకు 18వ ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన మిశ్రా.. ఇషాన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేశాడు. అతను వేసిన వైడ్‌‌‌‌ యార్కర్‌‌‌‌ను ఇషాంత్‌‌‌‌ డిఫెండ్‌‌‌‌ చేయగా.. బౌన్స్‌‌‌‌ అయిన బాల్‌‌‌‌ వికెట్లపై పడడంతో ఏడో వికెట్‌‌‌‌కు కీలకమైన 39 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాతి ఓవర్లోనే జయంత్‌‌‌‌.. రబాడకు రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. లాస్ట్‌‌‌‌ ఓవర్లో రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ (6)ను ఔట్‌‌‌‌ చేసిన అవేశ్‌‌‌‌ ఏడు రన్సే ఇవ్వడంతో ముంబై 140 మార్కు కూడా దాటలేకపోయింది. 

ఢిల్లీ నిదానంగా..
చిన్న  టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ఢిల్లీకి మంచి స్టార్ట్‌‌‌‌ దక్కలేదు. ఓపెనర్‌‌‌‌  పృథ్వీ షా (7)   సెకండ్‌‌‌‌ ఓవర్లో జయంత్​యాదవ్​కు రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ ఇచ్చి నిర్లక్ష్యంగా వికెట్‌‌‌‌ పారేసుకున్నాడు.  ఇలా స్టార్టింగ్‌‌‌‌లోనే వికెట్‌‌‌‌ పడడంతో ఢిల్లీ జాగ్రత్త పడింది. ఫుల్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న మరో ఓపెనర్‌‌‌‌ శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌ ఏమాత్రం రిస్క్‌‌‌‌ తీసుకోలేదు. సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేశాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన స్మిత్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌, జయంత్‌‌‌‌ ఓవర్లలో వెంటవెంటనే రెండు ఫోర్లు కొట్టినా తర్వాత నెమ్మదించాడు. ధవన్‌‌‌‌తో ఒక్కో పరుగు జోడించగా పవర్‌‌‌‌ప్లేలో ఢిల్లీ 39 రన్సే చేసింది. క్రునాల్‌‌‌‌ వేసిన 9వ ఓవర్లో  రెండు బౌండ్రీలు  బాదిన స్మిత్‌‌‌‌ స్పీడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే స్లో బాల్‌‌‌‌తో అతడిని ఎల్బీ చేసిన పొలార్డ్‌‌‌‌ సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 53 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ చేశాడు. ఈ దశలో ఢిల్లీ అనూహ్యంగా లలిత్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను బ్యాటింగ్‌‌‌‌కు పంపించింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న ధవన్‌‌‌‌కు అతను మంచి సపోర్ట్‌‌‌‌ ఇచ్చాడు. శిఖర్‌‌‌‌ కూడా నెమ్మదిగా జోరు పెంచాడు. రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌, బుమ్రా ఓవర్లలో ఒక్కో బౌండ్రీతో  ఇన్నింగ్స్‌‌‌‌కు ఊపు తెచ్చాడు. తర్వాతి రెండు ఓవర్లలో 3, 4 పరుగులే రావడంతో కాస్త ఒత్తిడి పెరిగింది. కానీ, టైమ్‌‌‌‌ ఔట్‌‌‌‌ తర్వాత చహర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో 6, 4 బాదిన ధవన్‌‌‌‌ స్కోరు వంద దాటించాడు. అదే ఊపులో మరో భారీ షాట్‌‌‌‌ ఆడే ప్రయత్నంలో క్రునాల్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. ఈ టైమ్‌‌‌‌లో లలిత్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ పంత్‌‌‌‌ చెరో ఫోర్‌‌‌‌ కొట్టి టీమ్‌‌‌‌పై ఒత్తిడి తగ్గించారు. కానీ, 17వ ఓవర్లో బుమ్రా వేసిన ఆఫ్‌‌‌‌ కట్టర్‌‌‌‌ను స్కూప్‌‌‌‌ ఆడే ప్రయత్నంలో పంత్‌‌‌‌.. క్రునాల్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో  ముంబై రేసులోకి వచ్చేలా కనిపించింది. అప్పటికి మూడు ఓవర్లలో ఢిల్లీకి 22 రన్స్‌‌‌‌ అవసరం అవగా.. లలిత్‌‌‌‌తో కలిసి హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (14 నాటౌట్‌‌‌‌) లాంఛనం పూర్తి చేశాడు. 

7 ఐపీఎల్‌లో అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఔటవడం ఇది ఏడోసారి. దాంతో, లీగ్‌లో రోహిత్‌ను ఎక్కువ సార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా మిశ్రా రికార్డు సృష్టించాడు. ఆరు సార్లు ఔట్‌ చేసిన వినయ్‌ కుమార్‌ను అధిగమించాడు. 

స్కోర్‌‌బోర్డ్‌‌
ముంబై:  రోహిత్‌‌‌‌‌‌‌‌ (సి) స్మిత్‌‌‌‌ (బి) మిశ్రా 44, డికాక్‌‌‌‌ (సి) పంత్‌‌‌‌ (బి) స్టోయినిస్‌‌‌‌ 2, సూర్యకుమార్‌‌‌‌ (సి) పంత్‌‌‌‌ (బి) అవేశ్‌‌‌‌ 24, ఇషాన్‌‌‌‌ (బి) మిశ్రా 26, హార్దిక్‌‌‌‌ (సి) స్మిత్‌‌‌‌ (బి) మిశ్రా 0, క్రునాల్‌‌‌‌ (బి) లలిత్‌‌‌‌ 1, పొలార్డ్‌‌‌‌ (ఎల్బీ) మిశ్రా 2, జయంత్‌‌‌‌ (సి అండ్‌‌‌‌ బి) రబాడ 23, రాహుల్‌‌‌‌ (సి) పంత్‌‌‌‌ (బి) అవేశ్‌‌‌‌ 6, బుమ్రా (నాటౌట్‌‌‌‌) 2, బౌల్ట్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 1; ఎక్స్‌‌‌‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 137/9;  వికెట్ల పతనం: 1–9, 2–67, 3–76, 4–77, 5–81, 6–84, 7–123, 8–129, 9–135, బౌలింగ్‌‌‌‌: స్టోయినిస్‌‌‌‌ 3–0–20–1, అశ్విన్‌‌‌‌ 4–0–31–0, రబాడ 3–0–25–1, మిశ్రా 4–0–24–4, అవేశ్‌‌‌‌ 2–0–15–2, లలిత్‌‌‌‌ 4–0–17–1.
ఢిల్లీ: పృథ్వీ (సి అండ్‌‌‌‌ బి) జయంత్‌‌‌‌ 7, ధవన్‌‌‌‌ (సి) క్రునాల్‌‌‌‌ (బి) 45, స్మిత్‌‌‌‌ (ఎల్బీ) పొలార్డ్‌‌‌‌ 33, లలిత్‌‌‌‌ (నాటౌట్) 22, పంత్‌‌‌‌ (సి) క్రునాల్‌‌‌‌ (బి) బుమ్రా 7, హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 14; ఎక్స్‌‌‌‌ట్రాలు: 10;  మొత్తం: 19.1 ఓవర్లలో 138/4; వికెట్ల పతనం: 1–11, 2–64, 3–100, 4–115; బౌలింగ్‌‌‌‌: బౌల్ట్‌‌‌‌ 4–0–23–0, జయంత్‌‌‌‌ 4–0–25–1, బుమ్రా 4–0–32–1, క్రునాల్‌‌‌‌ 2–0–17–0,  రాహుల్‌‌‌‌ 4–0–29–1, పొలార్డ్‌‌‌‌ 1.1–0–9–1.