డిల్లీ గాలిలో విషం..మళ్లీ ఆంక్షలు

డిల్లీ గాలిలో విషం..మళ్లీ ఆంక్షలు

ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకరంగా మారింది. ఎయిర్ క్వాలిటీ 400 పాయింట్లుగా నమోదు కావడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా తయారైంది. అయితే ఈ గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్టు కమిషనర్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ తెలిపింది. అయితే ఢిల్లీ - ఎన్సీఆర్ లో గాలి నాణ్యత మెరుగుపడడంతో ఇటీవలే ఆంక్షలను ఎత్తివేశారు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. దీంతో దేశ రాజధానిలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ముదురు ఎరుపు రంగు జోన్‌లలో ఉన్న గాలి నాణ్యత రాబోయే కొద్ది రోజుల్లో మరింత దిగజారే అవకాశం ఉందని కేంద్రం యొక్క ఎయిర్ క్వాలిటీ ప్యానెల్, CAQM తెలిపింది. దట్టమైన పొగమంచు, గాలులు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా గాలి అధ్వాన్నంగా మారిందని పేర్కొంది. దీని వల్ల దేశ రాజధానిలోని పిల్లలకు మరింత ప్రమాదకరం ఉందని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) పై పలువురు విరుచుకుపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సురక్షిత పరిమితి కంటే ప్రస్తుతం 100 రెట్లు ఎక్కువ ఉండడంతో అక్కడి ప్రజలు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు ఇది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని ఆరోపిస్తున్నారు.