శభాష్: ఆ క్యాబ్ డ్రైవర్ కు ఎంత నిజాయితీ ఉందో..

శభాష్:   ఆ క్యాబ్ డ్రైవర్ కు ఎంత నిజాయితీ ఉందో..

ఈ రోజుల్లో ఏదైనా వస్తువును పోగొట్టుకున్నామంటే.. ఇక దానిపై ఆశలు వదులుకోవాల్సిందే.  సాధారణంగా ప్రయాణం చేసేటప్పుడు కళ్లజోడు, సెల్ ఫోన్లు పోగొట్టుకుంటాం. ప్రస్తుతం ఫోన్ లేనిదే క్షణం గడవని పరిస్థితి.   అయితే తాజాగా ఢిల్లీలో క్యాబ్ బుక్ చేసుకొని ఓ వ్యక్తి హోటల్ కు వెళ్లాడు.  అయితే అతను ఫోన్ ను క్యాబ్ లో మర్చిపోయి వెళ్లాడు.  ఫొన్ పై ఆశలు వదులుకున్న సమయంలో ఆ క్యాబ్ డ్రైవర్ వచ్చి ఫోన్ ఇచ్చాడు.  

శ్యామ్యూల్, వివేక్ అనే ఇద్దరు మేరు క్యాబ్ సంస్థకు చెందిన కారును బుక్ చేసుకున్నారు.  హీరాలాల్ మోండల్ అనే మేరు క్యాబ్ డ్రైవర్ వారిని వారు వెళ్లాల్సిన హోటల్లో డ్రాప్ చేశాడు. అయితే వివేక్ తన ఫోన్ ను క్యాబ్ లో మర్చిపోయాడు.  దీంతో వారిద్దరు ఆందోళకు గురయ్యారు.

అసలే దేశ రాజధాని.. ఎక్కడైనా పోయిన వస్తువు రికవరీ కావడం అంటే అది అసంభవమనే చెప్పాలి.  అందులోనూ ఆటోల్లోనూ.. క్యాబుల్లోనూ మిస్సయ్యాయంటే ఇంతే సంగతులు.. కాని క్యాబ్ డ్రైవర్ మోండల్ తన నిజాయితీని చాటుకున్నాడు.  తన కారులో ప్రయాణించిన వారు మర్చిపోయిన ఫోన్ ను తిరిగి వారు బస చేసిన హోటల్ కు వచ్చి తిరిగి ఇచ్చాడు.   ఈ విషయాన్ని శామ్యూల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.  మేము  ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మేరు క్యాబ్‌లను బుక్ చేసాము. డ్రైవర్ ఫోన్  నంబర్ లేదు.   క్యాబ్‌లో నా సహోద్యోగి వివేక్ తన ఫోన్‌ను పోగొట్టుకున్నాడు, మేము ఫోన్‌ను తిరిగి పొందలేమని  భావించాము,  ఆశలు వదులుకున్నాము, కానీ డ్రూవర్ హీరాలాల్ మోండల్ ఫోన్‌తో హోటల్‌కి వచ్చాడని పోస్ట్ చేశాడు.  దీనికి హ్యాపీ మ్యాన్ క్యాబ్ సర్వీస్‌ను ట్యాగ్ చేసి, మోండల్‌ను తమ కంపెనీకి "ఆస్తి"గా లేబుల్ చేశాడు. . మానవత్వం అతని రక్తంలో ఉంది. దయచేసి అతనిని బాగా చూసుకోండి అని శామ్యూల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో ట్విట్టర్ వినియోగదారులు స్పందించారు.  ఈ యుగంలో ఇటువంటి నిజాయితీని చూడటం ఆనందంగా ఉందని ఒకరు రాయగా...   మంచి పనులను గుర్తించడం  అభినందించడం మంచిదని  మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, ఇంకొకరు ప్రభుత్వం అలాంటి నిజాయితీపరుల కోసం ఏదైనా అవార్డును ఏర్పాటు చేయాలి.  అలాంటి వారికి కొన్ని  బాధ్యతలు..  మెరుగైన ఉద్యోగాలు  ఇవ్వాలి. ఇది నిజాయితీకి చెల్లిస్తుందనే భావనను ప్రజలలో కలిగిస్తుంది."

ఈ ట్వీట్‌పై మేరు క్యాబ్స్ కూడా స్పందించింది. వారు ఇలా వ్రాశారు.   మా విలువలను  ఉదహరించే మా డ్రైవర్ భాగస్వాములను చూసి మేము గర్విస్తున్నాము. అసాధారణమైన కస్టమర్ సేవను అందించేందుకు  ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము. @IamShajanSamuel యొక్క మంచి గుర్తింపును మేము నిజంగా అభినందిస్తున్నాము. మేరుతో స్వారీ చేస్తూ ఉండండి!"మరోవైపు శామ్యూల్ ప్రజల వ్యాఖ్యలను మోండల్‌తో పంచుకున్నట్లు పేర్కొన్నారు.