సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు ఏడుపే..

సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు ఏడుపే..
  • ఢిల్లీ చేతిలో చిత్తు లీగ్​లో ఏడో ఓటమి
  • టాప్‌‌ ప్లేస్‌‌కు క్యాపిటల్స్‌‌

దుబాయ్‌‌: దేశం మారినా సన్‌‌రైజర్స్‌‌ ఆట మారలేదు.  కరోనా వల్ల ఐపీఎల్‌‌14కు ఊహించని బ్రేక్‌‌ వచ్చినా.. సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ తీరు మారలేదు.  అన్ని విభాగాల్లో ఫెయిలై.. సెకండ్‌‌ ఫేజ్‌‌ను ఓటమితో మొదలుపెట్టింది. బుధవారం ఇక్కడ  జరిగిన మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌‌రైజర్స్‌‌పై భారీ విజయం సాధించి మళ్లీ టాప్‌‌ ప్లేస్‌‌కు వెళ్లింది.  ఓవరాల్‌‌గా ఏడో ఓటమి మూటగట్టుకున్న హైదరాబాద్‌‌ ప్లే ఆఫ్‌‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. టాస్‌‌ గెలిచి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన సన్‌‌రైజర్స్‌‌ 20 ఓవర్లలో 134/9 స్కోరు చేసింది. అబ్దుల్‌‌ సమద్‌‌(28), రషీద్‌‌ ఖాన్‌‌(22) టాప్‌‌ స్కోరర్లు. ఢిల్లీ బౌలర్లలో రబాడ(3/37) మూడు వికెట్లు తీయగా అన్రిచ్​ నోర్జ్‌‌(2/12), అక్షర్‌‌ పటేల్‌‌(2/21) రెండేసి వికెట్లు సాధించారు.  ఛేజింగ్‌‌లో 17.5 ఓవర్లు ఆడిన ఢిల్లీ 139/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.  శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ( 41 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్‌‌) రీ ఎంట్రీలో అదరగొట్టగా శిఖర్‌‌ ధవన్‌‌(42),  రిషబ్‌‌ పంత్‌‌(35 నాటౌట్‌‌) రాణించారు. ఖలీల్‌‌, రషీద్‌‌ తలో వికెట్‌‌ తీశారు. రెండు వికెట్లతో పాటు పొదుపుగా బౌలింగ్​ చేసిన నోర్జ్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ దక్కింది.
ఢిల్లీ అలవోకగా..
ఛేజింగ్‌‌లో ఢిల్లీ అలవోకగా బ్యాటింగ్‌‌ చేసింది. పృథ్వీ షా(11) ఫెయిలైనా.. ఫస్ట్‌‌ ఫేజ్‌‌ ఫామ్‌‌ కొనసాగించిన శిఖర్‌‌ ధవన్‌‌  నిలకడగా ఆడాడు.  స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ క్రీజులో పాతుకుపోయిన అయ్యర్‌‌.. శిఖర్‌‌కు మంచి సహకారం అందించాడు. దీంతో10 ఓవర్లకు ఢిల్లీ 69/1పై  నిలిచింది. 11వ ఓవర్‌‌లో ధవన్‌‌ను ఔట్‌‌ చేసిన రషీద్‌‌ సన్‌‌రైజర్స్‌‌కు బ్రేక్ ఇచ్చాడు.  కానీ  మూడో వికెట్‌‌కు 67 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ చేసిన అయ్యర్‌‌–పంత్‌‌ సన్‌‌రైజర్స్‌‌కు మరో చాన్స్‌‌ ఇవ్వకుండా టార్గెట్‌‌ కంప్లీట్‌‌ చేశారు.  సందీప్‌‌ వేసిన 14వ ఓవర్‌‌లో వరుసగా రెండు బౌండ్రీలు కొట్టి అయ్యర్‌‌ దూకుడు పెంచగా.. కెప్టెన్‌‌ పంత్‌‌ క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి  ధాటిగా ఆడాడు.  దీంతో లక్ష్యం చకచకా కరిగిపోగా...హోల్డర్‌‌ బౌలింగ్‌‌లో భారీ సిక్సర్‌‌తో అయ్యర్‌‌ లాంఛనం పూర్తి చేశాడు.
ఆరెంజ్‌‌ ఆర్మీ ఫ్లాప్‌‌ షో
 టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఆరెంజ్‌‌ ఆర్మీకి ఢిల్లీ పేసర్లు ఏ దశలోనూ చాన్స్‌‌ ఇవ్వలేదు.  వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆరెంజ్‌‌ ఆర్మీ డీలా పడింది. నోర్జ్‌‌ వేసిన మూడో బాల్‌‌కే డేవిడ్‌‌ వార్నర్‌‌ (0) డకౌటవ్వగా రబాడ వేసిన ఐదో ఓవర్లో  చెత్త షాట్‌‌ ఆడిన సాహా(18) పెవిలియన్‌‌ చేరాడు. పవర్‌‌ ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌‌ 32/2పై నిలిచింది.  ఈ దశలో మూడో వికెట్‌‌కు 31 రన్స్‌‌ జోడించిన కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌(18), పాండే (18) ఇన్నింగ్స్‌‌ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ మూడు బాల్స్‌‌ తేడాలో వీరిద్దరూ ఔటవ్వడంతో రైజర్స్‌‌ కష్టాలు మరింత పెరిగాయి. కేదార్‌‌(3), హోల్డర్‌‌(10) నిరాశపర్చగా సమద్‌‌.. రబాడ వేసిన19వ ఓవర్‌‌లో  ఔటయ్యాడు. అదే ఓవర్‌‌లో  రషీద్‌‌ ఓ సిక్స్‌‌, ఫోర్ కొట్టాడు.  లాస్ట్‌‌ ఓవర్లో 10 రన్స్‌‌ రాబట్టిన రైజర్స్​ 130 రన్స్​​ మార్కు దాటింది.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్‌‌: 20 ఓవర్లలో 134/9 (సమద్‌‌ 28, రషీద్‌‌ 22, రబాడ 3/37,     ఈనోర్జ్‌‌ 2/12)
ఢిల్లీ: 17.5 ఓవర్లలో 139/2 (అయ్యర్‌‌ 47 నాటౌట్‌‌, ధవన్‌‌ 42, రషీద్‌‌ 1/26)