
ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ టోర్నీకి స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ అందుబాటులో ఉండడని ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతను కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని గంగూలీ చెప్పారు. పంత్ ఐపీఎల్ ఆడకపోవడం ఢిల్లీ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ టీమ్ కు పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తు్న్నాడు. దీంతో అతని స్థానంలోఆ జట్టు కొత్త కెప్టెన్ ను తీసుకోనుంది. ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ డెవిడ్ వార్నర్కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో వార్నర్ కంటే సీనియర్ ఆటగాడు మరెవరూ లేరు. ఒకవేళ స్వదేశీ క్రికెటర్ కు కెప్టె్న్సీ బాధ్యతలు ఇవ్వాల్సి వస్తే పృథ్వీషాకు ఆ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
కారు యాక్సిడెంట్‌లో గాయపడిన రిషబ్ పంత్‌కు బీసీసీఐ అండగా నిలిచింది. ఐపీఎల్ సాలరీతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ డబ్బులను కూడా పూర్తిగా చెల్లించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడేందుకు పంత్ రూ. 16 కోట్లు తీసుకుంటున్నాడు. బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 5 కోట్లు ఇస్తోంది.అయితే గాయం కారణంగా పంత్ ఇప్పుడు ఐపీఎల్‌కు దూరం కావడంతో డీసీ ఇవ్వాల్సిన రూ. 16 కోట్లతో కలిపి మొత్తం రూ. 21 కోట్లను బోర్డే చెల్లించనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్ గాయం లేదా ఇతర కారణాలతో ఐపీఎల్‌కు దూరమైతే ఆ డబ్బును బీసీసీఐ చెల్లించాలన్న రూల్ ఉంది. అయితే ఐపీఎల్ సాలరీని బోర్డు తన ఖజానా నుంచి చెల్లించాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో ఆడే సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు బోర్డు తరఫున ఇన్సురెన్స్ చేస్తారు. ఆ డబ్బులను ఇన్సురెన్స్ కంపెనీలు భరిస్తాయి. ఇందులో ఫ్రాంచైజీకి ఎలాంటి సంబంధం ఉండదు.