WPL Final 2024: ఒకే ఒవర్..మూడు వికెట్లు..W,0,W, W,0,1

WPL Final 2024: ఒకే ఒవర్..మూడు వికెట్లు..W,0,W, W,0,1

మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతోంది. ఆర్సీబీ బౌలర్ సోఫీ మాలినక్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ను గట్టి దెబ్బ తీసింది.. 8వ ఓవర్ లో ఏకంగా మూడు వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకిచ్చింది.. అప్పటివరకు వికెట్ కోల్పోకుండా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. W,0,W, W,0,1  వరుస బంతుల్లో టపటపా వికెట్లు కోల్పోయింది.పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 61/0 తో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్..7వ ఓవర్ పూర్తయ్యేసరికి 65/3 వికెట్లు కోల్పోయింది. 44 పరుగులు చేసిన షఫాలీ వేర్ హమ్ కు క్యాచిచ్చి వెనుదిరిగింది. మరో ఇద్దరు బ్యాటర్లు అలిస్ క్యాప్సే, జెమిమా రెడ్రాగ్స్ డకౌట్ అయ్యారు.